ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్, ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. మేటి వ్యాపారవేత్తలతోనూ ఆయన సంప్రదింపులు జరపనున్నారు. కమలా హారిస్‌ను కలిసిన రోజే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడే సుగాలను కూడా మోదీ కలుసుకునే అవకాశం ఉన్నది. ఆప్ఘనిస్థాన్ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ చర్చించనున్నారు.
కోవిడ్ 19, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ వాణిజ్యం, ఉగ్రవాదం లాంటి అంశాలను కూడా వారు చర్చిస్తారు. అలాగే పర్యటనలో చివరి రోజున యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించనున్నారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రధాని వెళ్తోన్న తొలి అంతర్జాతీయ పర్యటన ఇది.