భారత సంతతి వ్యక్తి, భారతీయ విద్యా భవన్ చైర్మన్ ఎన్‌కే రామచంద్ర మీనన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం నుండి ఆయన ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్నారు. కువైత్ నేషనల్ బ్యాంకులో బ్యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రామచంద్ర 1969 నుంచి కువైత్‌లోనే ఉంటున్నారు. 2000లో ఆయనకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. దాని నుంచి వచ్చిందే భారతీయ విద్యా భవన్. 2006లో కువైత్‌లో తొలి పాఠశాల ఇండియన్ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రారంభించారు. 2010లో అబుదాబిలో ప్రైవేట్ ఇంటర్నెషనల్ ఇంగ్లీష్ స్కూల్, 2014 సెప్టెంబర్‌లో అల్ ఐన్‌లో అల్ సాద్ ఇండియన్ స్కూల్, 2016 సెప్టెంబర్‌లో కువైత్ స్మార్ట్ ఇండియన్ స్కూల్, 2018లో అజ్మాన్‌లో వైజ్ ఇండియన్ అకాడమీ, 2019 ఏప్రిల్‌లో అల్ ఐన్‌లో భవన్స్ పెరల్ విజ్డమ్ స్కూల్ (బీపీడబ్ల్యూఎస్), 2020 ఏప్రిల్‌లో దుబాయ్‌లో భవన్‌స పెరల్ విజ్డమ్ స్కూల్ (బీపీడబ్ల్యూఎస్) స్థాపించారు.