భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్‌హుడ్ అవార్డు అందుకోనున్నారు. పర్యావరణ పరిరిక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా అలోక్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది బ్రిటన్‌లో జరిగిన కాప్ 26 సదస్సుకు అలోక్ అధ్యక్షుడిగా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలతో బ్రిటన్ ఒక ఒప్పందానికి అంగీకరించడంలో అలోక్ కీలకంగా వ్యవహరించారు. ఇది నిజంగా గొప్ప ప్రభావం చూపనుంది అని బ్రిటన్ విదేశీ, కామన్వెల్త్, డెవలప్మెంట్ ఆధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. కొత్త సంవత్సరం రోజున బ్రిటన్ రాజు చార్లెస్ 3 గౌరవించే వ్యక్తుల జాబితాలో భారత సంతతికి చెందిన ఈయనకు చోటు దక్కింది. అలోక్ శర్మ ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో 1967 జన్మించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు లండన్‌లోని రీడింగ్ నగరానికి వలస వెళ్లారు.
ప్రజా సేవలో విశిష్ట కృషి చేసిన 1,100 మందిని కొత్త ఏడాదిలో బ్రిటన్ రాజు గౌరవించనున్నారు. వీళ్లలో బ్రిటన్ మాజీ రాణి, దివంగత ఎలిజబెత్ 2 గిటారిస్ట్ బ్రయాన్ మే కూడా ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న విదేశాలకు చెందిన 30 మందిలో అలోక్ శర్మ ఒకరు. ఈ 30 మందిలో పర్యావరణ కార్యకర్తలు, విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, వైద్యులు, సమాజ సేవకులు ఉన్నారు.