Namaste NRI

ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్‌ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వల్లూరుపాలెంకు చెందిన ఆయన  ఆస్ట్రేలియన్‌ జాతీయ విశ్వవిద్యాలయంలో గత మూడు దశాబ్దాలుగా ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జాన్‌ షైన్‌ స్థానంలో 2022,  మేలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ళు ఈ పదవిలో కొనసాగనున్నారు. అకాడమీ అధ్యక్షుడిగా జగదీశ్‌ ఆస్ట్రేలియాలో సైంటిఫిక్‌ ఎక్సలెన్స్‌కు పాటుపడటంతో పాటు ఆ దేశ పార్లమెంటుకు సలహాదారుగా వ్యవహరిస్తారు.

                నానో టెక్నాలజీ రంగంలో రెండున్నర దశాబ్దాల పాటు విశేష కృషి జరిపినందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొఫెసర్‌ జగదీశ్‌ను ఇప్పటికే ఆ దేశ అత్యున్నత పురస్కారమైన కాంపానియన్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా అవార్డుతో సత్కరించింది. ప్రొ.జగదీశ్‌ పరిశోధనలు 700కు పైగా అంతర్జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా జగదీశ్‌ మాట్లాడుతూ ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events