అమెరికాలోని డల్లాస్ మెట్రో ఏరియాలోని ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్ నియామకమయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది. దాదాపు 2 లక్షల జనాభా ఉన్న ఫ్రిస్కో నగరంలో 49 పార్కులు ఉన్నాయి.
వేణు భాగ్యనగర్ స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చేగుర్తి. ఆ జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఢల్లీి యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారు.