Namaste NRI

పాకిస్థాన్‌లో ఓ మహిళకు అరుదైన గౌరవం..  తొలిసారిగా

ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా క్రైస్తవ మైనారిటీకి చెందిన డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌  నియమితులయ్యారు. పాక్‌ ఆర్మీ   మెడికల్‌ కోర్‌లో పనిచేస్తున్న రాబర్ట్స్‌ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్‌ సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా  ఆమె చరిత్ర సృష్టించారు. సీనియర్‌ పాథాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌ పాకిస్థాన్‌ ఆర్మీలో గత 26 ఏళ్లుగా పనిచేస్తున్నారు.

మరోవైపు హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌కు బ్రిగేడియర్‌గా పదోన్నది లభించినందుకు ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు అభినందనలు తెలిపారు. కాగా పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2021లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆ దేశంలో 96.47 శాతం ముస్లింలు ఉండగా, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు, 0.09 శాతం అహ్మదీ ముస్లింలు, ఇతరులు 0.03 శాతం మంది ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events