అమెరికాలో భారత సంతతికి మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియాకు చెందిన 54ఏళ్ల సుశ్మితా శుక్లా న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి ఉపాధ్యక్షరాలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నియామకం అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రెండవ అత్యున్నత పదవిని ఆమె అలంకరించనున్నారు. ఇన్సూరెన్స్ రంగంలో అపార అనుభవం గడించిన శుక్లా, యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొందారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు.
