దుబాయ్ ప్రభుత్వం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా బన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ దుబాయ్ అధికారితో కలిసి ఉన్న ఫొటోతో పాటు దుబాయ్ నగరం ఫొటోను షేర్ చేశాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కు ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)