అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) వీక్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి తన ఫ్యాషన్, దాతృత్వంతో ఫ్యాషన్ ఫర్ డెవలప్‌మెంట్ దాతృత్వం అవార్డు అందుకున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికి సానుకూల వ్యూహాలను ప్రోత్సహించేందుకు వినోదం, ఫ్యాషన్, వ్యాపార, రాజకీయాల్లో ప్రభావవంతమైన మహిళల సమూహం ఫ్యాషన్ ఫర్ డెవలప్‌మెంట్ (ఎఫ్4డి) వార్షికోత్సవం సందర్భంగా సమావేశమైంది. ఎఫ్4డీ చరిత్రలో భారత్ నుంచి మొదటిసారిగా సుధారెడ్డి హాజరయ్యారు.
