Namaste NRI

హీరోయిన్ కార్తీక నాయర్‌‌కు అరుదైన గౌరవం    

సీనియర్ నటి రాధ కూతురు, హీరోయిన్ కార్తీక నాయర్‌‌కు  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆమె దుబాయిలో గోల్డెన్ వీసా అందుకుంది. హీరోయిన్‌గా సినిమాలో  అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యాపారం వైపు అడుగు వేసింది. ఉదయ్‌ సముద్ర గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, కొన్నేళ్లుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో కీలక పాత్ర పోషించింది. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే స్థిరపడి, యంగ్‌ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తీకకు అక్కడి ప్రభుత్వం తాజాగా గోల్డెన్‌ వీసాతో సత్కరించింది. దుబాయిలోని టూఫోర్‌ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూఏఈకి చెందిన అధికార ప్రతినిధి హమద్‌ అల్మన్సూరి ఆమెకు గోల్డెన్‌ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేసింది. యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యూఏఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

Social Share Spread Message

Latest News