Skip to main content

Namaste NRI

జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్‌కు అరుదైన గౌరవం.. ప్రపంచం లోనే

ప్రపంచం లోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన వయసు 111 సంవత్సరాలు. సౌత్‌పోర్టు లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటోన్న ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం సర్టిఫికెట్ అందజేసింది. అయితే సాధారణ జీవన విధానం, అదృష్ట మే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన చెప్పడం గమనార్హం. టైటానిక్ నౌక మునిగిన కొన్ని రోజులకే 1912 ఆగస్టు 26న ఆయన జన్మించారు. తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో సేవలు అందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేశారు.  ఎప్పుడూ ధూమ పానం చేయలేదు. మద్యం మాత్రం అరుదుగా తీసుకునే వాడిని. వారానికి ఒకసారి (ప్రతిశుక్రవారం ) చేపలు, చిప్స్ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్ పాటించలేదు. పూర్తిగా ఇది జీవనశైలితోపాటు నా అదృష్టమే అని జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వూడ్ వివరించారు.

Social Share Spread Message

Latest News