బాలీవుడ్ అగ్ర కథానాయిక కరీనాకపూర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యునిసెఫ్‌కు (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) భారతదేశం తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. గత పదేళ్లుగా ఆమె యునిసెఫ్ సంస్థతో కలిసి పనిచేస్తున్నది. యునిసెఫ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ కరీనాకపూర్ భావోద్వేగానికి గురైంది. నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. గత పదేళ్లుగా యునిసెఫ్‌తో సాగిస్తున్న ప్రయాణం మరింత గొప్పగా ఉంటుందని కోరుకుంటున్నా. బాలల హక్కుల కోసం నిరంతరం పోరాడతాను అని తన సందేశంలో కరీనాకపూర్ పేర్కొంది.