అగ్రరాజ్యం అమెరికాలో భారత జాతిపిత మహాత్మాగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరంలో మ్యూజియం ప్రారంభమైంది. ఆయన జీవిత వివేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ఇది. ఇందులో కళాఖండాలు, డిజిటల్ డిస్‌ప్లేల ద్వారా మహాత్ముడి జీవిత సంఘటనలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియంను ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో న్యూజెర్సీ గాంధీయన్ సొసైటీ నిర్మించింది. అమెరికాలో గాంధీజీకి అంకితం చేసిన మొదటి మ్యూజియం ఇదే.
