టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడని తెలిసిందే. డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు చిరంజీవి. ఈ మేరకు ఇవాళ జరిగిన ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి Most Prolific Film Star (డ్యాన్సర్/ యాక్టర్‌గా) అవార్డును అందుకున్నాడు. చిరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా నిలిచి, మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు.
చిరంజీవి 150కిపైగా సినిమాల్లో నటించి వందలాది ఐకానిక్ సాంగ్స్‌లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ యాక్టర్లలో టాప్‌లో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలిచాడు. చిరంజీవి 46 ఏండ్ల సినీ కెరీర్‌లో 156 సినిమాలు, 537 పాటలు, 24వేల డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేసిన అరుదైన నటుడిగా రికార్డు నమోదు చేశాడు.