గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్లో మొదటిసారిగా మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి కి చోటు దక్కింది. ఈ సంస్ధ ది గ్లోబ్ గిఫ్ట్ గ్యాలా ప్యారిస్ ఎడిషన్ దశాబ్దాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుధారెడ్డి కూడా పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. తన ప్రదర్శనతో ఆహుతులను విశేషంగా ఆకుట్టుకున్నారు. ప్యారిస్ హిల్టన్ ఎవాలాంగోరియా, ఎలిజబెత్ హర్లి, అన్నా వింటోర్, హాలీవుడ్ తారలు, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులతో కూడిన గెలాక్సీలో సుధారెడ్డి సందడి చేశారు. దేశవ్యాప్తంగా అనేక సామాజిక ప్రభావ ప్రాజెక్టులు నడుపుతున్న మేఘా గ్రూప్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలను ఆమె విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యపై ఆమె ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గ్లోబల్ అంబాసిడర్లలో ఒకరిగా గ్లోబల్ గిఫ్ట్ కుటుంబంలో సుధారెడ్డి చోటు సంపాదించడం ఆమెకు లభించిన గొప్ప గౌరవమని పలువురు ప్రశంసించారు. దీంతో సుధారెడ్డి రిక్కీ మార్టిన్ డేవిడ్ బెక్హాం, గోర్డాన్ రామ్సే, క్రిస్టియానా రొనాల్డో, జేన్ ఫోండా, హాలీబెర్రి, హుడా కర్టెన్, గోల్డిహామ్, పమేలా ఆండర్సన్ వంటి ప్రపంచ ప్రముఖుల జాబితాలో చేరారు.
