భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భూటాన్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో ను ఆయన అందుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వా ధి నేతగా మోదీ నిలిచారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ చేతుల మీదుగా ప్రధాని ఈ అవార్డును అందుకున్నారు.
