ఇండియన్ బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్, మాజీ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియ్ పుల్లేల గోపిచంద్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం గోపిచంద్‌ను గోల్డెన్ వీసాతో సత్కరించింది. 10 ఏళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా జారీ చేసింది. వీసా అందుకున్న గోపిచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది నాకు దక్కిన అరుదైన గౌరవం. దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. యూఏఈలో నా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇక్కడ మరెన్నో ప్రత్యేక జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మా గల్ఫ్ బ్మాడ్మింటన్ అకాడమీలో పని చేయడానికి నాకు అవకాశం ఇస్తుందన్నారు. యూఏఈ వీసా అందుకున్న తొలి బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా గోపిచంద్ రికార్డుకెక్కాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)