Namaste NRI

శ్రీనివాస మానాప్రగడకు అరుదైన గౌరవం

ప్రముఖ ఎన్నారై  శ్రీనివాస మానాప్రగడకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్, వాలంటీర్ అవార్డు వరించింది. లాస్ వెగాస్‌లోని కాస్మోపాలిటన్ ఆఫ్ లాస్ వెగాస్ హోటల్‌లో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ సమావేశంలో అమెరికా చట్టసభల సభ్యుడు రో ఖన్నా చేతుల మీదుగా శ్రీనివాస మానాప్రగడ ఈ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస మానాప్రగడ మీడియాతో మాట్లాడుతూ, తనను ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన తన తండ్రి జానపద బ్రహ్మ మానాప్రగడ నరసింహ మూర్తి, తల్లి రేణుకాదేవి మానాప్రగడలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు దక్కడం వెనుకు భార్య కవిత, కుమారులు సింహా, మణిహార్, యువరాజ్, సోదరుడు సాయి సైచక్  మానాప్రగడ, కోడలు లక్ష్మి, మేనకోడలు శ్రేయశ్రీ , హిమశ్రీల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. స్థానిక ప్రముఖులు, తన శ్రేయోభిలాషులైన ఆనంద్ కూచిబొట్ల, జయరాం కోమటి, డా. రోమేష్ జాప్రా, రమేష్ తంగెళ్లపల్లి, భరత్ మాదాడి, వెంకట్ ఏక్క, అనిల్ అరబెల్లి, వంశీ రెడ్డి, సరస్వతి, నంద శ్రీరామ, ప్రసాద్, రవినేతి, సోహైల్, అమిత్ తన వెనుక ఉండి ఎంతో ప్రోత్సహించారన్నారు. పెద్దలు డా. పైళ్ల మల్లా రెడ్డి, మార్గదర్శకులు డా. విజయపాల్ రెడ్డి, డాక్టర్ హరనాథ్, డాక్టర్ మోహన్ పట్లోలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ గౌరవ సభ్యులు రో ఖన్నాకు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events