
గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన పాలస్తీనియన్లు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి తొలగాలని హమాస్ మిలిటెంట్లపైనే నిరసనకు దిగారు.

2007 నుంచి తమను పాలిస్తున్న హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లు భారీ నిరసన ప్రదర్శన చేశారు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర ప్రాంత పట్టణం బీట్ లేహియాలో వందలాది మంది నిరసనకారులు ప్ల కార్డులు చేతబట్టి హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాకీ యుద్ధం వద్దు, మేము చావాలనుకోవడం లేదు. మా పిల్లల రక్తం చవక కాదు అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, హమాస్ వైదొలగాలి అంటూ నినాదాలు చేశారు.
