భారత సంతతికి చెందిన బాలిక ప్రీషా చక్రవర్తి (9) అరుదైన రికార్డును సాధించింది. ప్రపంచంలో తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్నది. ప్రస్తుతం ఈ బాలిక అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రేడ్ 3 చదువుతున్నది. ప్రతిష్ఠాత్మక జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ దాదాపు 90 దేశాలకు చెందిన 16,000 మంది విద్యార్థులకు పలు పరీక్షలు నిర్వహించి తెలివైన విద్యార్థుల జాబితాను రూపొందించింది.
