తల్లిదండ్రులేమో ఇండియాలో. సంతానం అమెరికాలో. ఫోన్లో మాటలు, వీడియో కాల్స్ తప్ప ఎదురెదురుగా కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకునే సందర్భాలు తక్కువైపోయిన రోజులివి. అందుకే విదేశాల్లో ఉంటున్న తమ సంతానాన్ని చూసేందుకు తల్లిదండ్రులు తహతహలాడుతుంటారు. అవకాశం వస్తే చాలు రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోతారు. మరి, వంద మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని చూసుకునేందుకు అమెరికాకు వెళితే, వారందరూ కలిసి అక్కడ ఓ గ్రూప్ ఫొటో దిగితే మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. ఇటీవలే యూఎస్ఏలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మంది తమ సంతానాన్ని చూసుకునేందుకు అమెరికా వెళ్లారు. వర్జీనియా రాష్ట్రంలో వారందరూ తమ పిల్లలతో కలిసి ఫొటో దిగారు.