టెస్లా సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎలాన్ మస్క్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు కూడా అయిన మస్క్ సంపద విషయంలో ప్రపంచ కుబేరుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను ఇటీవలే అధిగమించారు. అయితే టైమ్ మేగజీన్ ఆయన్ను ఈ ఏటి మేటి వ్యక్తిగా (పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021)గా ప్రకటించింది. మేధావి, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన వ్యక్తి, దూరదృష్టి కలిగిన వ్యక్తి. పారిశ్రామిక వేత్త అంటూ పొగిడిరది. సొంత ఇల్లు లేని, ఇటీవల కాలంలో తన ఆస్తులు అమ్ముకొంటున్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా టైమ్ మ్యాగజీన్ మస్క్‌ను అభివర్ణించింది. ఉపగ్రహాలను పంపిస్తాడు వేలి కొనలతో స్టాక్ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తాడు. పాతాళానికి పడేస్తాడు. అంగాకర గ్రహాన్ని ఏలాలని కలలు కంటాడు అని పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)