Namaste NRI

పీవీ సింధుకు అరుదైన గౌరవం

తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు మరోమారు అరుదైన అవకాశం దక్కింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆరుగురు సభ్యులు గల ఈ కమిషన్‌ సభ్యురాలిగా నియమితులైన సింధు.. ఈ పదవిలో 2025 వరకు కొనసాగనున్నారు. భారత్‌కు ఒలింపిక్స్‌లో పీవీ సింధు రెండు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ పీవీ సింధుతో పాటు అమెరికాకు చెందిన ఐరిస్‌ వాంగ్‌, నెదర్లాండ్స్‌ ప్లేయర్‌ రాబిన్‌ తాబ్లింగ్‌, ఇండోనేషియాకు చెందిన గ్రేసియా పోలీ, దక్షిణ కొరియా నుంచి కిమ్‌ సోయెంగ్‌, చైనా ప్లేయర్‌ జెంగ్‌ వీ నియమితులు కావడం ఎంతో సంతోషంగా ఉందని జీడబ్లూయెఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

                ఈ ఆరుగురిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్‌ గా ఎంపిక చేస్తారు. ఇందుకోసం కమిషన్‌ త్వరలోనే సమావేశం కానుంది. అనంతరం అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌లోకి తీసుకుంటారు. వీరందరూ 2025లో జరిగే తదుపరి ఎన్నికల వరకు కొనసాగుతారని బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్స్‌ షిప్స్‌లో డిసెంబరు 17న అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events