బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో వరుణ్‌కు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. తాజాగా వరుణ్ దుబాయ్‌లో గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. నాకు యూఏఈ కొత్తకాదు. ఇప్పటివరకు పలుమార్లు సినిమాల చిత్రీకరణ కోసం దుబాయ్‌కు రావడం జరిగింది. మూవీలకు యూఏఈ నుంచి డెస్టినేషన్. గోల్డెన్ వీసా జారీ చేసిన యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)