ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు ఆశిష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌నిచ్చారు. రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. వినూత్నమైన కథతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమానికి చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్, ఆర్ట్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: అరుణ్ భీమవరపు.
