Namaste NRI

ప్రపంచ రాజకీయాల్లో ఓ సంచలనం…కీవ్‌లో ప్రత్యక్షమైన బ్రిటన్‌ ప్రధాని 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న వేళ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హఠాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ భేటీ అయ్యారు. దీంతో ప్రపంచ రాజకీయాల్లో ఓ సంచలనం రేగింది. బ్రిటన్‌ ప్రధాని కీవ్‌లో పర్యటిస్తున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతినిధి ఆండ్రియ్‌ సిబియా ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ భేటీ అయిన ఫొటోను ఆండ్రియ్‌ సిబియా పోస్ట్‌ చేశారు. ఉక్రెయిన్‌కు రక్షణ కల్పించడంలో యూకే అగ్రభావంలో వుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ప్రజలకు సానుభూతిని ప్రకటించడానికే జాన్సన్‌ ఉక్రెయిన్‌లో పర్యటించారని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొంది.

                ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని రాజధాని నగరం వీధుల్లో కలియతిరిగారు. అనంతరం ఉక్రెయిన్‌ పట్టణాల్లో పౌరుల మృతదేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిష్టను శాశ్వతంగా మసకబార్చిందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ అన్నారు.  ప్రజాస్వామ్యం ఇలా కనిపిస్తుంది. పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజాస్వామ్యం ఇలా కనిపిస్తుంది. ఇకపై ధైర్యంగా ఉంటుంది. ప్రజల మధ్య దేశాల మధ్య నిజమైన స్నేహం మాలాగే ఉంటుంది అని తెలిపారు. కీవ్‌పై రష్యా దాడిని తిప్పికొట్టినందుకు ఉక్రెయిన్‌ బలగాలను, పౌరులను బోరిస్‌ ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events