Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ సంస్థ‌లకు షాక్ ..1.6 మిలియ‌న్ల డాలర్ల జ‌రిమానా!

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన కంపెనీ ప‌న్నులు ఎగ‌వేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ట్రంప్ కంపెనీకి న్యూయార్క్ జ‌డ్జి జ‌రిమానా విధించ‌నున్నారు. ప‌న్నులు ఎగ‌వేసిన ఎగ్జిక్యూటివ్‌ల‌కు సుమారు 1.6 మిలియ‌న్ల డాల‌ర్లు జ‌రిమానా విధించే అవ‌కాశాలు ఉన్నాయి. ట్రంప్ కంపెనీ సుమారు 17 ప‌న్ను నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు గ‌తంలో పేర్కొన్న‌ది. బిజినెస్ రికార్డుల‌ను త‌ప్పుగా చూపించిన‌ట్లు ట్రంప్ ఆర్గ‌నైజేష‌న్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ట్రంప్ ఆర్గ‌నైజేష‌న్‌లో ప్ర‌తినిధులుగా చేసిన ఉద్యోగుల‌కు అత్య‌ధిక స్థాయిలో 1.6 మిలియ‌న్ల డాల‌ర్ల ఫైన్ మాత్ర‌మే వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జ‌డ్జి జువాన్ మాన్యువ‌ల్ మెర్చ‌న్ ఈ కేసులో తుది తీర్పు ఇవ్వ‌నున్నారు. ఈ కేసులో ట్రంప్ విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. త‌న కంపెనీలో ప‌నిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు ప‌న్ను ఎగ‌వేసిన విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని ఇటీవ‌ల ట్రంప్ పేర్కొన్నారు. శుక్ర‌వారం ఈ కేసులో తీర్పు వెలుబ‌డ‌నున్న‌ది. అయితే కోర్టు తీర్పు స‌మ‌యంలో ట్రంప్ కానీ, ఆయ‌న పిల్ల‌లు కానీ విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేదు. ట్రంప్ కంపెనీ త‌ర‌పున లాయ‌ర్లు కోర్టుకు హారుకానున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events