రష్యా ఆధ్వీనంలో ఉన్న ఖేర్సన్ నగరాన్ని పుతిన్ సేనలు ఖాళీ చేయడంతో అక్కడ సంబరాలు మిన్నంటాయి. స్థానికులు సంతోషంగా వీధుల్లోకి వచ్చి ఆనందం పంచుకున్నారు. సెంట్రల్ ఖేర్సన్ కూడలి వద్ద గల ఓ స్మారకంపై మార్చి తరువాత ఉక్రెయిన్ పతకం ఎగిరింది. కొంతమంది పౌరులు పెద్దఎత్తున సైనిక దుస్తుల్లో వేడుకలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఖేర్సన్‌లోకి తమ సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ప్రవేశించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ప్రస్తుతం మా రక్షకులు నగరంలోకి చేరుకోబోతున్నారు. మనం ప్రవేశించబోతున్నాం. ప్రత్యేక దళాలు ఇప్పటికే నగరంలో ఉన్నాయిన అని జెలెన్‌స్కీ తెలిపారు. మరోపక్క ఉక్రెయిన్ దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలోని ద్పైపర్ నది పశ్చిమ తీర నగరం నుంచి తమ దళాలు పూర్తిగా వైదొలిగినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఇది ఉక్రెయన్ యుద్ధంలో రష్యాకు మరో అవమానకర తిరోగమనం. ఇప్పటికే రష్యా కీలకమైన ఖేర్సన్ నగరాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.
