ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం మరొక ఆల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలు అన్నింటినీ అమలు చేసేందుకు జూలై 4 చివరి గడువు ఇచ్చింది. ఈ మేరకు తుది నోటీసులు జారీ చేసింది. జులై 4లోగా గత ఆదేశాలు అన్నింటినీ పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నెల 27న నోటీసు జారీ చేసింది. దీనిని ట్విటర్ భేఖాతరు చేయడంతో తుది నోటీసులు ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఇదే చివరి నోటీస్ అని స్పష్టం చేసింది. గడువు లోగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైతే ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని హెచ్చరించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)