అమెరికాలోని లూసియానాలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం తాగి బెడ్‌పై మూత్రం పోశాడని ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై ఏకంగా కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈస్ట్ బాటన్ రౌగ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, యువతిని అదుపులోకి తీసుకున్నారు. లూసియానాలో గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రియానా లాకోస్ట్ (25) అనే యువతి ఓ యువకుడితో ప్రేమలో ఉంది.ఈ క్రమంలో ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఇద్దరు పూటుగా మద్యం తాగి నిద్రపోయారు. నిద్రలో యువకుడు బెడ్‌పైనే మూత్రం పోసేశాడు. మద్యలో మెలుకువ వచ్చిన బ్రియానా బాయ్‌ఫ్రెండ్ బెడ్‌పై మూత్రం పోసి ఉండడం చూసి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. కిచెన్ నుంచి కత్తి తీసుకుని వచ్చి బాయ్‌ఫ్రెండ్‌పై దాడికి దిగింది. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు గాయాలతో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం బ్రియానా లాకోస్ట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)