Namaste NRI

అమెరికాలో కాల్పుల ఘ‌ట‌న

అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన కాల్పుల్లో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. సిటీ బ‌స్ స్టాప్ వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. గాయ‌ప‌డ్డ‌వారిని ఐన్‌స్టీన్ మెడిక‌ల్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. తుపాకీ కాల్పుల్లో రూట్ 18 బ‌స్సు, రూట్ 67 బ‌స్సు చిక్కుకున్నాయి. ఆ బ‌స్సుల వ‌ద్ద గ‌న్‌ఫైర్ జ‌రిగినా,  వాటిల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు మాత్రం ఎటు వంటి గాయాలు కాలేదు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో 911 కాల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసు ప్ర‌తినిధి టాన్య లిటిల్ తెలిపారు. క్రాస్ ఆన్ ఎలిమెంట‌రీ స్కూల్ స‌మీపంలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఆ బాధితుల్లో విద్యా ర్థులు ఎవ‌రైనా ఉన్నారో లేదో తెలియ‌ద‌ని పోలీసులు తెలిపారు. కాల్పులు జ‌రిగిన స‌మ‌యంలో స్కూల్ విడిచి పెట్టారు. కానీ కాల్పుల శ‌బ్ధాలు విన‌గానే,  ఆ పిల్ల‌ల‌ను మ‌ళ్లీ స్కూల్‌లో లాక్ చేశారు. బ‌స్సులోని ఇద్ద‌రు ప్ర‌యా ణికుల మ‌ధ్య జ‌రిగిన మాట‌ల ఘ‌ర్ష‌ణ ఆ త‌ర్వాత అది భౌతిక దాడికి దారి తీసింది. ఓ వ్య‌క్తి 9ఎంఎం గ‌న్‌తో ఫైర్ చేశాడు.  గ‌త కొన్ని రోజుల్లో అమెరికాలో జ‌రిగిన నాలుగ‌వ కాల్పుల ఘ‌ట‌న ఇది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events