Namaste NRI

బిపిన్ రావత్ కు సాయి దత్త పీఠంలో ఘన నివాళి

హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్‌ యుటిలిటీస్‌ చైర్మన్‌ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్‌ గురు, కమ్యూనిటీ లీడర్‌), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్‌ రావత్‌ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావతో మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్‌ రావత్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్‌ శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్‌ రావత్‌ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించిన నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్‌ కల్నల్‌ వీరేంద్ర ఎస్‌ తవాతియా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిపిన్‌ రావత్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events