దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసులు ఘనంగా నివాళులర్పించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్ బెర్రా, అడిలైడ్, బ్రిస్‌బేన్‌లోని ప్రవాస తెలంగాణ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ నాయకుడు రవి సాయాల మాట్లాడుతూ నోముల మరణం టీఆర్‌ఎస్ పార్టీ, అటు తెలంగాణ సమాజానికి తీరని లోటని తెలిపారు. ఉద్యమనేత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అన్నారు. రాజకీయ దురంధరుడు దివంగత నోముల ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించే వారన్నారు. తన ప్రాణాలను సైతం పేదల సేవకే అర్పించిన ఈ కాలం అరుదైన నాయకుడని ప్రశంసించారు.
ఆస్ట్రేలియాలోని వివిధ సంఘాల నాయకులు పలువురు అభిమానులు ఆయనతో తమ పరిచయాలను, అనుభవాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శివ, తేజ నరేష్, స్వాతి, తేజ యాదవ్, చందు, గణేష్, దేవేందర్, చైతన్య, వీరేందర్ ఎస్. రాజ వర్ధన్ రెడ్డి, ఇతర ప్రవాస తెలుగు సంఘాల సభ్యులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.