దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, షకీల, డాక్టర్ సంజయ్ దుబాయ్‌కి చేరుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో వీరికి తెలంగాణ జాగృతి ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రవాస తెలంగాణ బిడ్డలు ఘన స్వాగతం పలికారు. దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో దుబాయ్ వీధులు మార్మోగిపోయాయి.