Skip to main content

Namaste NRI

యువతకు స్ఫూర్తినిచ్చే సోలో బాయ్‌ : సెవెల్‌హిల్స్‌ సతీష్‌

బిగ్‌బాస్‌ ఫేం గౌతమ్‌కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా, నవీన్‌కుమార్‌ దర్శకత్వంలో సెవెల్‌హిల్స్‌ సతీష్‌ నిర్మించిన చిత్రం సోలో బాయ్‌. నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌ విలేకరులతో ముచ్చటించారు. మధ్యతరగతి జీవితాలకు అద్ధం పట్టే కథతో తెరకెక్కిన సినిమా సోలో బాయ్‌. గతంలో మేం చేసిన బట్టల రామస్వామి బయోపిక్‌ ఓ ప్రయోగం. అది మాకు అన్ని విధాలా వర్కవుట్‌ అయ్యింది. నిర్మాణం విషయంలో ఆ సినిమా నుంచి నేర్చుకున్న పాఠాలను బేస్‌ చేసుకొని, తగు జాగ్రత్తలతో సోలో బాయ్‌ తీశాం. ప్రేక్షకులకు అన్ని రకాలుగా వినోదాన్ని పంచే సినిమా ఇది అని అన్నారు.  

తమ కాళ్ల మీద నిలబడాలని తపించే యువతకు స్ఫూర్తినిచ్చేలా మా సోలో బాయ్‌ చిత్రం ఉంటుంది  అని అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేశానని, తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వల్ల ఆర్ధికంగా నిలదొక్కుకున్నానని, సినిమాపై పాషన్‌తో ఈ సినిమా తీశానని ఆయన తెలిపారు. మెగాఫోన్‌ పట్టుకోవడం తన లక్ష్యమనీ, త్వరలోనే దర్శకత్వం వహిస్తానని ఈ సందర్భంగా సెవెన్‌హిల్స్‌ సతీష్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News