అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వాటర్‌టౌన్ నగరంలోని పెర్కిన్స్ అంధుల పాఠశాలలో సరికొత్తగా ఆవిష్కరించిన లైట్‌సౌండ్ పరికరాన్ని పరీక్షిస్తున్న అసిస్టివ్ టెక్నాలజీ మేనేజర్ మిన్ హా. సాధారణంగా సూర్యగ్రహణం వంటివి సంభవించినప్పుడు ప్రజల వివిధ రకాల కళ్లద్దాల వంటివి ధరించి ఆకాశం వైపు చూస్తూ ఆనందిస్తారు. అయితే, అటువంటి అవకాశం లేని అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా , తద్వారా ఆ ఖగోళ దృశ్యాన్ని వారు ఆస్వాదించేలా చేస్తుంది.