అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతవారం టక్సన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు కొందరు అంతుబట్టని అనారోగ్యానికి గురికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది తమ కండ్లలో తీవ్ర అసౌకర్యం ఉందని తెలిపారు. తన కండ్లు మండటంతో తానేమీ చూడలేకపోయాయని, వెంటనే దవాఖానకు వెళ్లాలని ట్రంప్ అభిమాని మేరా రొడ్రిగజ్ చెప్పారు.