Skip to main content

Namaste NRI

రిషి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ.. రెండు స్థానాల్లో

బ్రిటన్‌లో రిషి సునాక్‌ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్‌ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పార్టీ ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే`అయిన్‌స్టీ సీటులో లేబర్‌ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్‌ పార్టీ భారీ మెజార్టీని పొందింది. ఇక మరో స్థానమైన సోమర్టన్‌`ఫ్రోమ్‌ను లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ గెలుచుకొంది. ఇక కన్జర్వేటివ్‌ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్‌`సౌత్‌ రూయిస్లిప్‌ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది  బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల నిర్వహించారు. ఇక్కడ పార్టీ గతంలో కంటే బలపడిరది. ఈ ఫలితాలు సునాక్‌ నాయకత్వంపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News