Namaste NRI

న్యూయార్క్‌లో విజయవంతమైన తానా బ్లడ్‌ డ్రైవ్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్‌ ఆడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 7వ తేదీన నిర్వహించిన ఈ బ్లడ్‌ డ్రైవ్‌ విజయవంతమైంది.

తానా న్యూయార్క్‌ కేర్స్‌ చైర్‌ ప్రసాద్‌ కోయి, న్యూయార్క్‌ కేర్స్‌ సెమినార్స్‌ చైర్‌ రజిత కల్లూరి ఆధ్వర్యంలో అడ్‌ – హాక్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ భర్తవరపు, దిలీప్‌ ముసునూరు, యమునా మన్నవ, సుచరిత అనంతనేని, హేమలత బొర్రా, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్‌ నాదెళ్ల సహాయంతో బ్లడ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్లాన్‌ చేసి విజయవంతంగా నిర్వహించారు.

అడ్‌-హాక్‌ కమిటీ మరియు యువ వాలంటీర్లు దాతలకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం విశేషం. మొత్తంగా 30 పింట్ల బ్లడ్‌ ను సేకరించారు. సేకరించిన బ్లడ్‌ ను అవసరమైన వారికి అందించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చిన మద్దతు వల్లనే విజయవంతమైందని నిర్వాహ కులు తెలిపారు. ముఖ్యంగా హైస్కూల్‌ పిల్లలు వలంటీర్లుగా చేసిన సేవలు మరువలేనవంటూ వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress