యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (యూటీహెచ్‌వో) ఆధ్వర్యంలో యూకే పార్లమెంట్ వీక్‌ను విజయవంతంగా నిర్వహించారు. సమాజాన్ని యువతను ప్రేరేపించి వారిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్ద డమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యం, పరిపాలన, పార్లమెంటరీ ప్రక్రియల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ద్వారా యూటీహెచ్‌వో సమాజానికి తన వంతు సేవలను అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే చర్చలు, వాదనలు, ఇతర కార్యకలాపాల ద్వారా పౌరులకు ప్రజాస్వామ్య ప్రక్రియల్లో తమ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను విధానాల రూపకల్పన ప్రభావాన్ని, తమ భవిష్యత్తును నిర్మించడంలో ఎలా తోడ్పాటు అందించగలరో అర్థం చేసుకొనే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
యూటీహెచ్‌వో 2024 యూకే పార్లమెంట్ వీక్‌ను ఆరు ప్రదేశాల్లో నిర్వహించింది. ఈ వేదిక ద్వారా స్థానిక ప్రజలు, యువత, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజాస్వామ్యం, పరిపాలన, పార్లమెంటరీ ప్రక్రియలపై కీలక చర్చలను విజయవంతంగా నిర్వహించారు. రాబోయే తరం భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వీక్‌లో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ యూటీహెచ్‌వో కృతజ్ఞతలు తెలిపింది.