దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ భారత పారిశ్రామికవేత్త కుటుంబానికి సరికొత్త అనుభవం ఎదురైంది. ఓ హోటల్ లిఫ్ట్‌లో పారిశ్రామికవేత్త తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఏకంగా దుబాయ్ రాజు ప్రత్యక్షమయ్యాడు. అంతేగాక, ఆ పారిశ్రామికవేత్త కుటుంబంతో కలిసి రాజు ఫొటోలు దిగాడు. ఆ కొద్ది నిమిషాలు వారితో సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత లిఫ్ట్ దిగి వెళ్లిపోయాడు. ఈ అనూహ్య ఘటన ఆ పారిశ్రామికవేత్త కుటుంబానికి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. భారత్‌కు చెందిన వెల్త్ రిసెర్చ్ ఏజెన్సీ హరూన్ ఇండియా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అనస్ రెహ్మాన్ జునైద్ ఇటీవల తన కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ అట్లాంటిస్ ది రాయల్ అనే ప్రముఖ హోటల్‌లో దిగారు. గత వారం అనస్ రెహ్మాన్ తన కుటుంబంతో కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా, లిఫ్ట్ 22వ ఫ్లోర్‌కు చేరుకోగానే వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ఘటన చోటుచేసుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)