Skip to main content

Namaste NRI

ఆదర్శ కుటుంబం నుంచి సర్ ప్రైజ్ .. పోలీస్‌గా నారా రోహిత్

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు (జూలై 25) నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రోహిత్ ఎంతో స్టైలిష్, డైనమిక్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఈ పోస్టర్‌తో నారా రోహిత్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్న విషయం దాదాపు ఖరారైంది. ఆయన పాత్ర సాధారణ పోలీస్ పాత్ర కాకుండా, మాస్ అప్పీల్‌తో పాటు కథను కీలక మలుపు తిప్పే శక్తివంతమైన అధికారిగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం తర్వాత రోహిత్ మరోసారి యూనిఫామ్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ పోస్టర్‌తో నారా రోహిత్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్న విషయం దాదాపు ఖరారైంది. ఆయన పాత్ర సాధారణ పోలీస్ పాత్ర కాకుండా, మాస్ అప్పీల్‌తో పాటు కథను కీలక మలుపు తిప్పే శక్తివంతమైన అధికారిగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం తర్వాత రోహిత్ మరోసారి యూనిఫామ్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News