ప్రవాస భారతీయులకు అమెరికా తీపి కబురు చెప్పింది. శాశ్వత నివాసం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు, గ్రీన్‌కార్డుల జారీలో ఇప్పటి వరకు ఉన్న దేశాలవారీగా కోటా విధానాన్ని ఎత్తివేసి, పని ఆధారిత గ్రీన్‌కార్డులను జారీ చేసేందుకు వీలుగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. అధికార డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి లిండా సాంచెజ్ యూఎస్ సిటిజెన్‌షిప్ యాక్ట్-2023 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మూడేండ్లకు సంబంధించిన గ్రీన్‌కార్డులను ఒకేసారి జారీ చేయనున్నట్టు తెలుస్తున్నది.సరైన పత్రాలు లేకుండా 5 ఏండ్లుగా పన్నులు చెల్లిస్తున్న వారికి గ్రీన్‌కార్డులు జారీ చేయాలని బిల్లులో పొందుపరిచారు.