ఢల్లీిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వైఎస్ చాన్స్‌లర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్‌ను నియమించారు. 60 ఏండ్ల జగదీశ్‌కుమార్ పదేండ్ల పాటు లేదా ఆయనకు 65 ఏండ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢల్లీిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితమే పదవీకాలం ముగిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆయననే కొనసాగిస్తూ వస్తున్నది. తాజాగా దేశంలోని అన్ని యూనివర్సిటీలను మానిటర్ చేసే యూజీసీకి చైర్మన్‌గా నియమించింది.ఈ పదవిలో కొనసాగిన ప్రొఫెసర్ డీపీ సింగ్‌కు 65 ఏండ్లు నిండటంతో గత డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అది ఖాళీగా ఉన్నది. 1991`95 మధ్య ప్రొఫెసర్ రాంరెడ్డి యూజీసీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టిన తెలుగు వ్యక్తి జగదీశ్‌కుమార్.
జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఇంటి పేరు ఊరుపేరు ఒక్కటే కావడం యాద్పచ్చికం. ఆయన తల్లిదండ్రులు మామిడాల రంగారావు, జయప్రదాదేవి. రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1994లో రిటైర్ అయ్యారు. జగదీశ్‌కుమార్‌కు 1990లో లక్ష్మితో వివాహం జరిగింది. వారికి సాకేత్, కార్తీక్ అనే కుమారులు ఉన్నారు. సాకేత్ నానో ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తుండగా, చిన్న కుమారుడు కార్తీక్ నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంఎస్ చేస్తున్నారు. మామిడాలలో వారికి ఇల్లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. జగదీశ్ కుమార్‌కు షిటోరాయ్ కరాటేలో మంచి ప్రావీణ్యం ఉన్నది. ఆయన అక్క సునీత, చెల్లెలు గీత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. జగదీశ్ కుమార్ యూజీసీ చైర్మన్‌గా ఎంపిక కావడంలో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.