Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియాలో దారుణ ఘ‌ట‌న

ఆస్ట్రేలియాలో హైద‌రాబాద్‌కు చెందిన మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. భ‌ర్త అశోక్ రాజ్ భార్య శ్వేత‌ను హ‌త‌మార్చాడు. విక్టోరియాలోని బ‌క్లీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ఓ చెత్త‌డ‌బ్బాలో శ్వేత మృత‌దేహాన్ని అక్క‌డి పోలీసులు గుర్తించారు. భార్య‌ను చంపిన త‌ర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. అత్త‌గారింట్లో కొడుకుని వ‌దిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును ద‌ర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు,  అశోక్ రాజే శ్వేత‌ను హ‌త‌మార్చిన‌ట్లు నిర్ధారించారు. ప్ర‌స్తుతం అశోక్ రాజ్‌ను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం.

Social Share Spread Message

Latest News