Skip to main content

Namaste NRI

మెక్సికోలో దారుణ సంఘటన

మెక్సికోలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మ‌స్ ముందస్తు వేడుక‌లో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా,  మరో 12 మంది గాయపడ్డారు. మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రం సాల్వాటియెర్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి క్రిస్మ‌స్ ముంద‌స్తు సెలబ్రేషన్స్ నిర్వ‌హించారు. ఈ వేడుక‌లు టియేర్రా నెగ్రా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. అయితే ఓ ఆరుగురు వ్య‌క్తుల‌ను భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఆ వేడుక‌కు నిర్వాహ‌కులు అనుమ‌తించ‌లేదు. దీంతో ఈ సెలబ్రేషన్స్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఎంజాయ్ చేసి తిరిగి వెళ్తుండగా, ఆరుగురు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వంటనే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చనిపోయినవారిలో దాదాపు అందురూ యువతీవయుకులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రశ్నించి లోపలికి అనుమతించకపోవడంతో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events