శ్రీలంక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిలిపివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 నుంచి 60 ఏండ్లకు కుదించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడేందుకు అనవసరపు ఖర్చులను సైతం తగ్గించుకుంటున్నది. నియామకాలకు స్వస్తి చెప్పడమే కాకుండా పన్నులు, కరెంటు చార్జీలను ఏ విధంగా తగ్గించుకోవాలో చూస్తున్నది.