గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నా యని వెల్లడిరచారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపిన హమాస్ మిలిటెంట్లు 200 మందికి పైగాతమ చెరలో బంధిం చారు. వీరిని విడిపించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు వీరిని విడిచిపెట్టే దాకా దాడులు అపేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. గాజాపై నిరిరామంగా బాంబుదాడులతో విరుచుకు పడుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో13,300 మందికి పైగా జనిపోయినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఖతర్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న సంధి ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని అమెరికా వెల్లడించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)