Skip to main content

Namaste NRI

ఓటమి దెబ్బతో బుద్దొచ్చింది.. వలసలపై ట్రంప్‌ యూటర్న్‌?

మధ్యంతర ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు జ్ఞానోదయం కలిగింది. తన వలసవాద విధానం మరీ కఠినంగా ఉందని ఆయన ఒప్పుకున్నారు. రానున్న సంవత్సరాల్లో డెమోక్రటిక్‌ పార్టీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. నవంబర్‌ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిపైనా పట్టు సాధించారు. ఈ క్రమంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న అనేక స్థానాలను కైవసం చేసుకుని ట్రంప్‌ను భారీగా దెబ్బతీశారు.

తాను చేపట్టిన కఠినమైన వలస విధానాలు ఎన్నికల్లో తనకు ప్రయోజనాన్ని, నష్టాన్ని రెండింటినీ కలిగించాయని ఆయన పేర్కొన్నారు. సరిహద్దులను మూసివేసినందుకు తనకు ఏ+గ్రేడ్‌ లభించిందని, అలాగే నేరస్థులను దేశం నుంచి బయటకు పంపినందుకు మంచి గుర్తింపు వచ్చిందని ట్రంప్‌ చెప్పారు. అయితే మంచి ఉద్యోగాలు కలిగి ఉండి, కేవలం చట్టాన్ని ఉల్లంఘించి, అంటే దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం ద్వారా తప్పుచేసిన వారిని కూడా పంపేయడం వల్ల తనకు నష్టం జరిగింది అని ఆయన అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events