అమెరికాలో నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ అసోసియేషన్ (ఎన్‌బిఎ)కు విపరీత ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌బిఎలో చోటు కోసం అక్కడి క్రీడాకారులు ఎంతగానో ఎదురు చూస్తారు. భారత్‌లో ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఎందో అంతకుమించి అమెరికాలో ఎన్‌బిఎకు ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి లీగ్‌లో ఓ మహిళ ఏకంగా కోచ్‌గా ఎంపిక కావడం సంచలనంగా మారింది. అమెరికాలో బోస్టన్‌కు చెందిన భారత సంతతి మహిళా సోనియా రామన్ ఎన్‌బిఎలో మెంపిస్ గ్రిజ్‌లిస్ జట్టుకు సహాయక కోచ్‌గా ఎంపికైంది. ఈ క్రమలో ఎన్‌బీఎలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి మహిళగా రామ్ చరిత్ర సృష్టించింది. కాగా రామన్ తండ్రిది చెన్నై కాగా, ఆమె తల్లిది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం. ఇక వీరిద్దరూ చాలా క్రితమే అమెరికా వెళ్లి పోయి అక్కడే స్థిరప డ్డారు. సోనియా రామ్‌న్‌కు బాస్కెట్ బాల్ క్రీడ అంటే ఎంతో ఇష్టం. ఇదే సమయంలో బాస్కెట్‌బాల్ కోచింగ్‌కు సంబంధించి ప్రత్కేక శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో పలు క్లబ్ జట్లకు కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తించింది.
